Tuesday, March 11, 2025

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ

- Advertisement -
- Advertisement -

ఒట్టావా (కెనడా) : కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ త్వరలో పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. లిబరల్ పార్టీ నాయకుడీగా 59 మార్క్ కార్నీ ట్రూడో స్థానంలో ఎన్నికయ్యారు. ట్రూడో కెనడా ప్రధాని పదవికి జనవరి లో రాజీనామా చేశారు. మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేపట్టేవరకూ ట్రూడో ప్రధానిగా కొనసాగుతారు. కాగా, తాను పదవి చేపట్టిన తర్వాత కెనడా – భారత సంబంధాలను పునర్నించేందుకు కృషి చేస్తానని ఎన్నికకు ముందే మార్క్ కార్నీ వెల్లడించారు. మార్క్ కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా పనిచేశారు.

కెనడా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారతదేశంలో గల సంబంధాలను పునర్నిర్మిస్తానని, అలాగే ఇతర దేశాలతో నూ వాణిజ్య సంబంధాలను విస్తృత పరుస్తానని మార్క్ కార్నీ వెల్లడించారు. లిబరల్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యేందుకు ముందు ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్నిదేశాలతో విలువలతో కూడిన వాణిజ్య సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్ ట్రంప్ తో కెనడా విలీనం ముప్పు, ట్రేడ్ వార్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మార్క్ కార్నీ ఆచీ తూచీ మాట్లాడారు.

2023 సెప్టెంబర్ లో కెనడా ప్రధాని ట్రూడో తమ పార్లమెంటులో ప్రసంగిస్తూ, ఖలిస్తానీ అనుకూల వేర్పాటు వాద నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం, భారతదేశం ఖండించడం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించాయి. ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపాలని సవాల్ చేశాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఉభయదేశాలు తమతమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నాయి. కెనడా ప్రధాని ట్రూడో నిరాధారమైన, తీవ్రమైన ఆరోపణల కారణంగానే ఉభయదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకు ట్రూడోనే బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ గతంలో స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News