Tuesday, March 11, 2025

రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారు: చామల

- Advertisement -
- Advertisement -

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపి చామల స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యత గల కేంద్రమంత్రి పదవిలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన వ్యవహార శైలిలో ఆయన సహచర మంత్రి బండి సంజయ్ బాటలో నడుస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవడంపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకున్నారన్నారు.

కానీ, ఒక్క దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రత దృష్ట్యా పోలీసులు తీసుకున్న చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ టీం కప్పు గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని కిషన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యతా యుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కిషన్‌రెడ్డి అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ, చిల్లర మల్లర విషయాలలో రాజకీయం చేసి, వాస్తవాలు కానీ వాటిని మాట్లాడటాన్ని తప్పుపడుతున్నామని, దయచేసి ఇలాంటివి మానుకోవాలని చామల సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News