Tuesday, March 11, 2025

ప్రధాని మోడీ, ఓం ప్రకాష్ బిర్లాతో ఎంపి ఈటల రాజేందర్ భేటీ

- Advertisement -
- Advertisement -

బిజెపి ముఖ్యనేత, మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోడీ,లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాతో భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని కుటుంబసమేతంగా వెళ్లి వారిని కలిశారు. తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజెపి ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఈటల రాజేందర్ పేరు ఖరారు అయిందని,

అందుకే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం తీసుకునేందుకు కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లారని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం ధర్మపురి అర్వింద్, మాధవనేని రఘునందన్ రావుతో పాటు పలువురు నాయకులు ప్రయత్నం చేయగా.. అధిష్టానం మాత్రం ఈటలవైపే మొగ్గు చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇస్తే బిజి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని బిజెపి అగ్రనాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News