Tuesday, March 11, 2025

ఐదుగురు ఏకగ్రీవం?

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానాలకు నామినేషన్లు వేసిన ప్రధాన
పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థుల తరపున హాజరైన
సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి, సిపిఐ నారాయణ, దాసోజు
కార్యక్రమానికి తరలివచ్చిన కెటిఆర్, హరీశ్‌రావు సహా బిఆర్‌ఎస్ నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ తరపున నెల్లికంటి స త్యం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన నామినేషన్ దా ఖలు కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంఎల్‌ఎలు, సిపిఐ నేతలు హాజరయ్యారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రవణ్‌కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సోమవారం(మార్చి 10) తోనే నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. ఒక్క రోజు ముందు కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌తో పాటు సిపిఐ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో సోమవారం ఆయా పార్టీల ఎంఎల్‌సి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 20న ఎన్నికలు జరుగనున్నాయి. వీరితో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు శ్రీకాంత్ సిలివేరు, చంద్రశేఖర్ చలిక, బోగ తిలక్ కూడా నామినేషన్లు వేశారు. అయితే ఈ ముగ్గురు ఒక్క ఎంఎల్‌ఎ సంతకం లేకుండా నామినేషన్ వేసినట్లు తెలిసింది. మంగళవారం(మార్చి 11) అధికారులు నామినేషన్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత పోటీలో ఎవరూ లేకపోతే అభ్యర్థులు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News