Wednesday, March 12, 2025

‘ఛావా’ సంచలనం.. ‘బాహుబలి-2’ రికార్డు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి-2’ కలెక్షన్ రికార్డులను దాటేసింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన బాహుబలి-2 భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ‘ఛావా’ ఆ రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి-2 చిత్రం హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు సాధించగా.. ఛావా ఇప్పటికే రూ.516 కోట్ల వసూళ్లు సాధించింది. విడుదలైన 25 రోజుల్లోనే ఈ వసూళ్లు సాధించింది ఛావా. అంతేకాక.. హిందీ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా ఛావా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News