Wednesday, March 12, 2025

ఘోర ప్రమాదం: బస్సు బోల్తా పడి.. 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జోహనస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహనస్‌బర్గ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జోహనస్‌బర్గ్‌లోని మెయిన్ ఒ.ఆర్ టాంబో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలో హైవే అంచుపై ప్రయాణిస్తున్న అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. తూర్పు జోహనస్‌బర్గ్ నుంచి ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టౌన్‌షిప్ నుంచి ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 45 మందికి పైగా గాయపడ్డారు. ఏకుర్హులేని అత్యవసర సేవ నిర్వహణ బృందం ఘటన స్థలికి చేరుకొని బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. ఇంకా ఇద్దరి మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నాయని.. వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News