- Advertisement -
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పట్టణీకరణ, బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఎపి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు 2025ను అసెంబ్లీలో గొట్టిపాటి రవి ప్రవేశ పెట్టారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా కీలకమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఇప్పటికే కేంద్రం బిల్లు తీసుకొచ్చిందని అన్నారు. 15 రాష్ట్రాలు ఇప్పటికే లిప్టులు, ఎస్కలేటర్ల చట్టం అమలు చేస్తున్నాయని తెలిపారు. పూర్తి అధ్యయనం తర్వాత ఈ బిల్లును చట్టసభలో ప్రవేశ పెడతామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
- Advertisement -