Wednesday, March 12, 2025

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టిజిపిఎస్పి విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. తుది కీ, మాస్టర్ ప్రశ్నాపత్రంతోపాటు ఒఎంఆర్ షీట్లను కూడా తమ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొవచ్చని ప్రకటించింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గాను గత ఏడాది డిసెంబర్‌లో 5,51,943 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,57,981 మంది హాజరయ్యారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్-2 పరీక్ష నిర్వహించగా.. 2,55,490 ఆ పరీక్ష రాశారు. ఇక 16 తేదన పేపర్ అదే సమయాల్లో పేపర్-3 పరీక్షకు 2,51,738 మంది పేపర్-4 పరీక్షకు 2,51,486 మంది హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News