Wednesday, March 12, 2025

రాగల 20 ఏళ్లలో భారత్‌కు 30వేల మంది పైలట్లు అవసరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాగల 15 నుంచి 20 ఏళ్లలో భారత్‌కు 30వేల మంది పైలట్లు అవసరమవుతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం తెలిపారు. దేశీయ విమానయాన సంస్థలు తమ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకుంటున్నందున 1700 కంటే ఎక్కువ విమానాల కొనుగోళ్లకు ఆర్డర్ చేశాయని ఆయన తెలిపారు. 38 విమాన శిక్షణ సంస్థల వివిధ అంశాలను అధికారులు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని, ఈ సంస్థలకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 800 విమానాలు నడుస్తున్నాయని, 1700 విమానాల కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టారని, ప్రస్తుతం దేశంలో ఆరు వేల నుంచి ఏడు వేల పైలట్లు పనిచేస్తున్నారని, రాగల 15 నుంచి 20 ఏళ్లలో మరో 30వేల మంది పైలట్ల అవసరం ఉందని, ఇండియాను ట్రయినింగ్ హబ్‌గా చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. పౌర విమానయాన మార్కెట్‌లో భారత్ ప్రపంచంలోనే చాలా వేగంగా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో విమానాశ్రయాలను కేటగరైజేషన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News