Wednesday, March 12, 2025

పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు

- Advertisement -
- Advertisement -

ఈనెల 13వ తేదీ నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
జిఓ జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు నంది అవార్డుల స్థానంలో (గద్దర్ అవార్డుల) కోసం జీఓ ఎంఎస్ నెంబర్ 25 జీఓ (ఐ అండ్ పిఆర్) మంగళవారం ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2023 వరకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇవ్వకపోవడంతో, ఆ సంవత్సరాలకు సంబంధించి ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫీచర్ ఫిలిం కాటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఏసి గార్డ్ లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ గద్దర్ అవార్డులను పలు కేటగిరీల్లో ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

జాతీయ సమైక్యతపై చలన చిత్రం, బాలల చలన చిత్రం, పర్యావరణం, హెరిటేజ్, చరిత్రలపై చలన చిత్రం, డెబిట్ ఫీచర్ ఫిలిం, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఇతర కేటగిరీల్లో భాగంగా తెలుగు సినిమాలపై బుక్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు వ్యక్తిగత అవార్డులు అందిస్తామని ప్రభుత్వం ఈ జిఓలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News