Wednesday, March 12, 2025

పాకిస్థాన్‌లో రైలు హైజాక్

- Advertisement -
- Advertisement -

30 మంది భద్రతా సిబ్బంది హతం, బందీలుగా 182 మంది
బెలూచిస్తాన్ వేర్పాటు వాదుల దాష్టీకం ప్రయాణికులను వదిలిపెట్టిన బిఎల్‌ఎ

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును మంగళవారంనాడు హైజాక్ చేశారు. 30మంది భద్రతా సిబ్బందిని హతమార్చి, మరో182మంది వివిధ విభాగాల భద్రతా బలగాలను బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా సాధారణ ప్రయాణికులను విడుదల చేశారు. వారిలో పిల్లలు, మహిళలు ఉన్నారు. పెషావర్‌కు వెళ్తుండగా గుడాలార్ పిరు కోనేరి స్టేషన్ల మధ్య ఈ రైలును హైజాక్ చేశారు. తొలుత వేర్పాటువాదులు రైలుపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

బిఎల్‌ఏ సాయుధులు రైలు మార్గాన్ని పేల్చివేసి, ఒక సొ రంగ మార్గం వద్ద జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ను నిలిపివేశారు. భద్రతా దళాలతో సహా రైలులోని ప్రయాణికులను బందీలుగా చేసినట్లు తెలిపారు. ట్రైన్ హైజాక్‌కు అడ్డుకునేందుకు యత్నించిన సైనికుల్లో కొందరిని కాల్చి చంపినట్లు స్థానికి వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల్లో ట్రైన్ డ్రైవర్ గాయపడ్డారు. వెంటనే పాకిస్తాన్ ప్రభు త్వం అదనపుసైనిక బలగాలను, సహాయ బృం దాలను హుటాహుటిన ఘటనా స్థలికి పంపిం ది. తీవ్రవాదులను మట్టుపెట్టి ప్రయాణికులు అందరినీ రక్షస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. పాకిస్తానీ ఆర్మీ చేసిన దాడిని తిప్పికొట్టామని, 182 మందిని బందీలుగా పట్టుకున్నామ ని బిఎల్ ఏ ప్రకటించింది.

పాక్ సైన్యం వైమానికదాడులు ఆపకపోతే, మొత్తం బందీలందరినీ చంపివేస్తామని హెచ్చరించింది. ఏదైనా సైనిక చర్యకు పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏదైనా జరగరానిది జరిగితే బందీలను హతమార్చుతామని, దీనికి పాక్ ప్రభుత్వానిదే బాధ్యత అని బిఎల్‌ఎ ప్రకటించింది. బిఎల్‌ఏ చర్యను పాకిస్తాన్ దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ ఖండించారు.

అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొన్ని దశాబ్దాలుగా తమ ప్రాంతానికి పాక్ నుంచి సాతంత్య్రం కావాలని పోరాడుతోంది. పాక్‌లోని బలూచిస్తాన్ ప్రాంతం అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులను పంచుకుంటోంది. కొంత కాలంగా ఈ ప్రాంతం లో ఉగ్రవాదుల దాడులు పరిపాటిగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News