Wednesday, March 12, 2025

పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద వార్షికంగా రూ. 6000 నగదు ప్రయోజనాన్ని అందించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ఇప్పటికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో చేరని రైతులను కూడా దీనిలో చేర్చబోతున్నారు. ఈ పథకంలో చేరేందుకు అ ర్హులైన రైతులందరిని గుర్తించి కేంద్రానికి సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరా రు. ‘ఒకవేళ ఎవరైనా చేరనట్లయితే వారిని పి ఎం కిసాన్ నిధిలో చేర్చడానికి మాకు సహకరించండి. అలాంటి రైతులకు గత వాయిదాలు అ ందేలా చూస్తాం’ అని చౌహాన్ ప్రశ్నోత్తర సమమయంలో తెలిపారు.

అర్హులయిన రైతులందరూ పిఎంకిసాన్ పోర్టల్‌కు వెళ్లి తమను తా ము రిజిష్టర్ చేయించుకోవాలని, ఈకెవైసి చే యించుకోవాలని ఆయన కోరారు. రూ. 2000 చొప్పున మూడు వాయిదాలు రైతు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని కూడా ఆయన వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రధాని కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని తమిళనాడుకు సంబంధించిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ తెలిపారు. ‘ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ విషయమై నేను రెండుసార్లు తమిళనాడుకు వెళ్లాను.

కానీ అక్కడ ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వచ్చి నన్ను కలువలేదు’ అన్నారు. ‘తమిళనాడు ప్రజలను గౌరవిస్తాం. వారికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాం. 2018 డిసెంబర్ 1 నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పనిచేస్తోంది. ఈ పథకం కింద భూకమతాలు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో మొత్తం రూ. 6000 చెల్లిస్తాం’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News