Wednesday, March 12, 2025

తగినంత గుర్తింపు దక్కడం లేదు

- Advertisement -
- Advertisement -

శ్రేయస్ అయ్యర్
ముంబై: అత్యంత నిలకడైన ఆటను కనబరిచినా తనకు త గినంత గుర్తింపు దక్కడం లేదని టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వాపోయాడు. పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ సాధించడం లో అయ్యర్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా అతను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలు వె ల్లడించాడు. కొంత కాలంగా తాను నిలకడగా రాణిస్తున్నానని, అయినా తనపై ఇప్పటికీ ఎవరికీ నమ్మకం కుదరడం లేదన్నాడు. ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కడం లేదన్నాడు. త న కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని వివరించాడు. కిందటి సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఐపిఎల్ విజేతగా నిలిపానన్నాడు.

అయినా కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం తనను ఘోరంగా అవమానించిందన్నా డు. తనను రిటేన్ చేసుకోక పోవడం బాధకు గురిచేసిందన్నాడు. కెరీర్‌లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను తా ను చవిచూశానని అయ్యర్ పేర్కొన్నాడు. రానున్న రోజు ల్లో టీమిండియాలో కీలక పాత్ర పోషించడమే లక్షంగా పెట్టుకున్నానని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శన సంతృప్తి ఇచ్చిందన్నాడు. జట్టు విజయంలో తనవం తు పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నాడు. కీలక మ్యాచుల్లో రాణించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అ య్యిందన్నాడు. ఇక తన దృష్టంతా రానున్న ఐపిఎల్‌పైనే నిలిచిందన్నాడు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టడమే లక్షంగా ముందుకు సాగుతానని శ్రేయస్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News