ప్రగతి పరుగుతో వికసిత్ భారత్ వైద్య పరిశోధనల నుండి అణ్వస్త్ర ప్రయోగాల వరకు భారత దేశం స్వయం స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్నది. దేశం అభివృద్ధి చెంది 2047 నాటికి అభివృద్ధి ఫలాలు అందరికీ అందడమే వికసిత్ భారత్ ప్రగతికి అర్థం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానం. సైన్స్ పట్ల విశ్వాసంలో 2వ స్థానం. శాస్త్రీయ పరిశోధన పత్రాలలో 3వ స్థానం. వ్యవసాయ ఉత్పత్తులలో 8వ స్థానం. ప్రపంచ పర్యావరణ సూచిలలో 8వ స్థానం. రక్షణ వ్యయంలో 4వ స్థానం. విదేశీ మారక ద్రవ్య నిలవలలో 4వ స్థానం. స్పేస్ డాక్లో 4వ స్థానం. ప్రపంచ పర్యాటక అభివృద్ధిలో 39వ స్థానం. ప్రపంచ పోటీతత్వ సూచిలో 37వ స్థానం. నూతన ఆవిష్కరణలలో 40వ స్థానం. ఇంధన పరివర్తన సూచీలో 63 వ స్థానం. అందరికీ డిజిటల్ ఫలాలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీని ఆకలింపు చేసుకుని యువత భారత్ సొంతం.
1947 ఆగస్ట్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తరువాత 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న యువ భారత దేశం అభివృద్ధి చెందిన స్వర్ణ భారతదేశంగా వారసత్వ వికాసాన్ని వికసింప చేయాలని మన ప్రజాస్వామ్యంలో యువత చట్ట సభలలో శాసనాలను చేయడంలో ముందుండి ఆత్మనిర్భర్ దేశంగా మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి భారత ప్రజాస్వామ్య దేశం ఆదర్శంగా కొనసాగుతున్నది. 2023లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలో అమెరికా (26,854 బిలినియన్ డాలర్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జపాన్, నాల్గవ స్థానంలో జర్మనీ, ఐదవ స్థానంలో ఇండియా (3750 బిలినియన్ డాలర్లు) ఉన్నది. 2027- 28లో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారుతున్నది. 2047 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరి వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.
ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలకు సభ్యత్వం ఉన్నా 5 దేశాలకు మాత్రమే భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వంతో వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో (50% యువ జనాభా) కలిగి, విస్తీర్ణంలో 7వ స్థానంలో 2021 లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.04%ను, ప్రస్తుతం 80%పైగా కలిగి ఉన్న భారత దేశం యుద్ధాలు ముఖ్యం కాదు మనుషుల ప్రాణాలు ముఖ్యమని మన ప్రధాన మంత్రి ప్రపంచ శాంతి కోసం పిలుపునిచ్చిన మన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్‌కు భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని గట్టిగా వినిపిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా భారత్ దౌత్యసంబంధాలు మరో మైలురాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఐక్య రాజ్యసమితి సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని 99% దేశాలు తమ వాణిని వినిపిస్తున్నాయి.
ఇటీవల భారత దేశ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతూ భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. జాతీయ కరెన్సీని స్థిరీకరించడానికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చెయ్యడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉపయోగపడతాయి. 1951లో భారత దేశ మారక ద్రవ్యనిల్వలు 2.16 మిలియన్ డాలర్లు మాత్రమే. ప్రపంచంలో ప్రస్తుతం చైనా మొదటి స్థానం (33,16,400 మిలియన్ అమెరికన్ డాలర్లతో)లో, జపాన్ రెండవ స్థానం (12,35,700 మిలియన్ అమెరికన్ డాలర్లతో)లో స్విట్జర్లాండ్ మూడవ స్థానం (802.438 మిలియన్ అమెరికన్ డాలర్లతో) లో భారత దేశం నాల్గవ స్థానం (704.885 మిలియన్ అమెరికన్ డాలర్లతో)లో ఉన్నది.2047 నాటికి ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బలమైన విదేశీ మారక ద్రవ్యనిల్వలు పెంచుకొని వికసిత్ భారత్ వైపు పరుగులు తీస్తున్నది. రక్షణ వ్యయంలో అమెరికా, చైనా, రష్యాలో తరువాత భారత్ నాల్గవ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో అమెరికా 91,600 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుండగా, భారత్ 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తూ యుద్ధ ఆయుధాలను అగ్రదేశాలకే ఎగుమతి చేస్తూ తనను తాను రక్షించుకొంటూ అమెరికా, రష్యా, ప్రాన్స్, యుకె, చైనాల తరువాత అణ్వాయుధాలను కలిగి 144 కోట్ల జనాభాకు రక్షణ కలిపిస్తున్నది. భారత రక్షణ తన ప్రజల రక్షణ అంటూ సాంకేతికతను అక్కున చేర్చుకున్నది.
ప్రణాళికలు ప్రవేశపెట్టి ముస్తఫా కేమాల్ పాషా ఆధ్వర్యంలో టర్కీలో జరిగిన అభివృద్ధి, రష్యాలో లెనిన్, స్టాలిన్, జపాన్ లో ముత్యు హిటో అభివృద్ధిని చూశాం. భారత్‌లో పంచవర్ష ప్రణాళికలు ఆ తరువాత నీతిఆయోగ్ ద్వారా జరుగుతున్న అభివృద్ధినీ చూస్తున్నాం. వికసిత్ భారత్ 2047కు ఇంకా 23సంవత్సరాల దూరంలో అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. భారత్ అలీనదేశాల కూటమిలో , బ్రిక్స్, జి20, క్వాడ్ కూటమిలలో ఉంటూనే వేగంగా అభివృద్ధి చెందుతూ వర్ధమాన దేశాలకు ఒక దిక్సూచిగా ఉన్నది. గ్లోబల్ నార్త్‌లో (ప్రథమ ప్రపంచ దేశాలుగా పిలువబడిన అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు, జపాన్) దేశాలు ఉన్నాయి. గ్లోబల్ సౌత్‌లో (ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణ ఆఫ్రికా) దేశాలు ఉన్నాయి. భారత్ గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహిస్తూనే గ్లోబల్ నార్త్‌కు 2047 ధ్యేయంగా వికసిత్ భారత్ వైపు పయనిస్తున్నది.
భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం కావడం, నిపుణ మానవ సిబ్బందితో మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా శీఘ్రప్రగతిని సాధించడం భారత్‌కు కలిసివచ్చే అవకాశం. ఆరోగ్య రంగంలో అనేక ఆవిష్కరణలు చేస్తూ కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌కు, వైద్య మెడిసిన్స్ అగ్రరాజ్యాలకు అందించి ప్రపంచంలోని పేదదేశాలకు సహాయాన్ని అందించిన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ద్వారా భారత ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నది. ఒక దేశ ఆరోగ్యమే దాని శ్రేయస్సుకు పునాది, ఆరోగ్యకరమైన జనాభా దేశవృద్ధికి, ఉత్పాదకతకు ఆవిష్కరణకు తోడ్పడుతున్నది. నోవా స్పేస్ నివేదిక ప్రకారం 2014 -24 మధ్యలో అంతరిక్ష పరిశోధనలకు ఇండియా 1300 కోట్ల డాలర్లను ఖర్చు చేయగా, తత్ఫలితంగా 6000 కోట్ల డాలర్ల సంపద సమకూరింది. ఇస్రో అసమాన ప్రతిభ చూపుతూ 129 వ్యోమనౌకలను ప్రయోగించి అమెరికా, కెనడా, యుకె, దక్షణ కొరియా, జపాన్‌లతో పాటు పలు దేశాలకు చెందిన 432 పైగా ఉపగ్రహాలను నీలాల నింగిలోకి పంపింది.
చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపడమే కాకుండా, సూర్యడుపై పరిశోధన చేస్తూనే శుక్రయాన్, గగన్‌యాన్, చంద్రయాన్ -4 కు సిద్ధమై స్పేస్డాక్లో 4వ స్థానంలో చరిత్ర సృష్టించింది. విపత్తుల సమయాలలో వివిధ దేశాలకు సహాయని అందిస్తూ పొరుగు దేశాలను ఆదుకుంటున్నది.సమాజంలోని ఏ వర్గం అభివృద్ధికి దూరంగా కాకూడదని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, మహిళా సాధికారతకు, విజ్ఞాన వికాసం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సబ్ కా వికాసం సహకారం చేసుకునేలా వికసిత్ భారతవైపు ప్రయాణించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నది. వికసిత్ భారతానికి విశిష్ట లక్షణాలు కలిగి భవిషత్తరాలు తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించి పారిశ్రామిక, ఆర్థిక, ఇతర రంగాలలో భారత్ భవిష్యత్‌లో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా, 2047 నాటికి వికసిత్ భారత్‌గా ఆవిష్కరణ అవుతున్నది.
నర్సింగు కోటయ్య
99859 30885