Wednesday, March 12, 2025

రోహిత్‌కు ఆ అర్హత ఉంది.. ఆసీస్ మాజీ కెప్టెన్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు రెండు ఐసిసి ట్రోఫీలు అందించాడు. అయితే ఈ సందర్భంగా రోహిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. కొందరు మాత్రం అతని ఫిట్‌నెస్, ఫామ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయం తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడని వచ్చిన వార్తలకు రోహిత్ చెక్ పెట్టాడు. తాను వన్డేల నుంచి ఇప్పట్లో రిటైర్ కావట్లేదని రోహిత్ చెప్పాడు. కానీ, 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడుతాడా.. లేదా అనే దానిపై సందిగ్ధత మాత్రం అలాగే కొనసాగుతుంది.

తాజాగా రోహిత్ రిటైర్‌మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. 2027 ప్రపంచకప్ ఆడేందుకు రోహిత్ శర్మ అన్ని విధాలుగా అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ రిటైర్‌మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అతను ఆడిన తీరు చూస్తే.. ఎవరైనా అతని కథ ముగిసింది అనుకోరు. రోహిత్‌కు జట్టులో ఉండటం, నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశాడు. ఇందులో అతను వచ్చే ప్రపంచకప్ ఆడేలనే లక్ష్యం కనిపిస్తోంది. గత ప్రపంచకప్ కోల్పోయాడు. అందుకే మరొకటి ఆడి జట్టుకు అందించాలనే అతను కోరుకుంటున్నాడు’’ అని పాంటింగ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News