Thursday, March 13, 2025

ఒక్క సినిమాకే ఇంతా.. కోట్లు పెట్టి కారు కొన్న హీరోయిన్!

- Advertisement -
- Advertisement -

హిందీలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి.. ఆ తర్వాత తెలుగులో ఐటం గర్ల్‌గా అడుగుపెట్టింది నటి ఊర్వశీ రౌతేలా. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘వేర్ ఈజ్‌ ద పార్టీ’ పాటలో చిందులు వేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో చేసి.. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహరాజ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి, ‘దబిడి దిబిడి’ అంటూ సాగే పాటకు కూడా చిందులు వేసింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఈ భామ మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. ఎక్కడ చూసిన ‘దబిడి దిబిడి’ పాట పెట్టుకొని చిందులు వేస్తుంది ఈ బ్యూటీ.

అయితే పెద్దగా సినిమాల్లో అవకాశాలు రానప్పటికీ.. లగ్జరీ లైఫ్‌లో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయదు ఈ బ్యూటీ. ఖరీదైన దుస్తులు, ఆభరణాలతో రిచ్ లైఫ్‌ని అనుభవిస్తుంది. తాజాగా ఈ భామ గురించి మరో వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కొనుగోలు చేసిందట ఊర్వశీ. ఇదే నిజమైతే.. ఇంత ఖరీదైన కారు కొనుగోలు చేసిన తొలి హీరోయిన్‌గా ఊర్వశీ రికార్డుల్లోకి ఎక్కుతుంది. అంతేకాక.. ఇన్‌స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లోనూ ఈ భామకు స్థానం దక్కిందని టాక్. ప్రస్తుతం ఊర్వశీ వెల్‌కమ్ టు ద జంగిల్, కసూర్-2 సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News