Thursday, March 13, 2025

హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

హర్యానా లోని పది మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 పురపాలకల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క మేయర్ సీటు కూడా దక్కలేదు. హర్యానా మాజీ సిఎం భూపిందర్ సింగ్ హుడా ఇలాకా అయిన గురుగ్రామ్, రోహ్‌తక్‌లలో కూడా కాంగ్రెస్‌కు ఘోరపరాజయమే ఎదురైంది.న అధికార బీజేపీ మొత్తం పదింట 9 మేయర్ పదవులను దక్కించుకుంది. మరో మేయర్ స్థానం బీజేపీ రెబెల్ , స్వతంత్ర అభ్యర్థి ఇందర్‌జిత్ యాదవ్‌కు దక్కింది. మానేసర్ మేయర్ పదవికి ఆయన ఎంపికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ , ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి చవి చూసింది. గురుగ్రామ్‌లో బీజేపీ నాయకుడు రాజ్‌రాణి మేయర్‌గా విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News