Thursday, March 13, 2025

అన్నదాతలే ఆత్మ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాభివృద్ధిలో వారే కీలకం
రైతుల అభ్యున్నతికి తెలంగాణ
ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
వరి సాగులో దేశంలోనే రాష్ట్రానికి
అగ్రస్థానం తెలంగాణ గేమ్ ఛేంజర్
‘మహాలక్ష్మి’ మహిళల చేతికి
1000 మెగావాట్ల సౌర విద్యుత్తు
ప్రాజెక్టులు అసెంబ్లీ, మండలి
సంయుక్త సమావేశంలో గవర్నర్
జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం బీఆర్‌ఎస్
నినాదాల మధ్య సాగిన ప్రసంగం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ, మండలి సంయు క్త సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తన ప్రసంగంలో విస్పష్టంగా ప్రకటించా రు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ముందుగా అసెంబ్లీకి చేరుకు న్న గవర్నర్‌కు శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.

తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అన్నారు. గద్దర్, అంజయ్య వంటి ఎం దరో మహానుభావులు ప్రజల కోసం కృషి చేశారని, జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని తెలిపారు. సామాజిక న్యా యం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని, అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర ప్రజల సాకారానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సహా అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం వం టి వారని, రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందని తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకితభావానికి నిదర్శనమని అన్నారు

. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా ఉందని, ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ పురోగమించడమే కాదని, రూపాంతరం చెందుతోందని గవర్నర్ అన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్‌గా మారిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. మహిళలకు 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.5005.95 కోట్లు ఆదా అయిందని, ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యం అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత లభిస్తోందని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అగ్రశ్రేణి శిక్షణ అందుతోందన్నారు. సివిల్ సర్వీసు పరీక్షల ఆశావహుల కోసం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తెచ్చామని, గత ఏడాది 55 వేల మందిగా పైగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ రూ.10 లక్షల వరకు పెంచామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించామని వివరించారు.

రాష్ట్రానికి రైతులే ఆత్మ
రాష్ట్రానికి రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతివ్వడం, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని గవర్నర్ చెప్పారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నామని, రైతుకు పంట సాయాన్ని రూ. 12 వేలకు పెంచినట్లు చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ఇదే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. రూ.20,616.89 కోట్లతో 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామన్నారు. వరి రైతులకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతు నేస్తం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000 ఇస్తున్నామన్నారు. 566 రైతు వేదికలను ఆడియో-విజువల్ మీడియా సమకూరుస్తూ ఏర్పాటు చేశామని గవర్నర్ చెప్పారు.

తెలంగాణ భావోద్వేగం
అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని అన్నారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదు, ఒక భావోద్వేగం అని తెలిపారు. మహిళల చేతికి 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు అగ్రశ్రేణి శిక్షణ. సివిల్ సర్వీసు పరీక్షల ఆశావహుల కోసం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్ వర్శిటీ ఏర్పాటుకు బిల్లు ఆమోదం, ప్రభుత్వ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజిని రూ.10లక్షల వరకు పెంచామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించామని, ఎస్సీఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రవేశపెట్టనున్నామని వివరించారు. 49,500 ఉద్యోగాలు కల్పించేలా దావోస్‌లో రూ.1,78,950 పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News