Thursday, March 13, 2025

విద్యార్థిని చితకబాదిన టీచర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలం, ని పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని భూమేష్ అనే టీచర్ చితకబాదడంతో తలకు బ లమైన గాయాలయ్యా యి. క్లాస్‌లో అల్లరి చేస్తున్నాడని ఆగ్రహానికి లోనైన టీచర్ అదుపు తప్పి, నిగ్రహం కోల్పోయి విచక్షణా రహితంగా చితకబాదాడు. బుధవారం పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి లోకాయి నవీన్, మౌనిక కుమారుడు లోకాయి రిషి పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఫిజికల్ సైన్స్ చెబుతున్న టీచర్ భూమేశ్వర్ తన క్లాస్‌లో అల్లరి చేస్తున్నాడని రిషిని తీవ్రంగా కొట్టాడు.

తీవ్ర గాయాలపాలైన స్టూడెంట్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గాయాలపాలైన రిషిని భీంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తన కుమారుడిని కొట్టిన సంగతి స్థానిక ఎంఇఓ డి. స్వామికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధను వివరణ కోరగా.. తనకు విషయం తెలియదన్నారు. కాగా, అల్లరి చేస్తున్నాడనే కారణంతో తీవ్రంగా విద్యార్థిని గాయపరిచిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ డిమాండ్ చేశారు. గురువారం పాఠశాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News