రాజకీయాలంటే పిల్లలాట అనుకుంటున్నారా?
చాలామంది సీరియస్‌గా పనిచేయడం లేదు
ఎమ్మెల్యేలు, విప్‌లు పనితీరు మార్చుకోవాలి
ఒకసారి గెలవడం గొప్పకాదు.. మరోసారి అసెంబ్లీకి
రావడమే గొప్ప వచ్చేనెల 6వ తేదీ నుంచి అన్ని
జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్
ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి
సభ్యులు కచ్చితంగా సభకు రావాల్సిందే సీఎల్పీలో
సిఎం రేవంత్ క్లాస్
రాజకీయాలంటే పిల్లలాట అనుకుంటున్నారా? చాలామంది సీరియస్‌గా పనిచేయడం లేదు ఎమ్మెల్యేలు, విప్‌లు పనితీరు మార్చుకోవాలి ఒకసారి గెలవడం గొప్పకాదు, మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప వచ్చేనెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపిలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి సభ్యులు కచ్చితంగా సభకు రావాల్సిందే సీఎల్పీలో సిఎం రేవంత్ క్లాస్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభు త్వ విప్‌ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విపక్ష బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సభలో వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకు నే ప్రయత్నం చేస్తుంటే మీరు కనీసం స్పందించడం లేదని, నోరు మెదపడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని సిఎం రేవంత్ అసహనం వ్యక్తంచేశారు. ఇకనైనా ప్రభుత్వ విప్‌లు పనితీరు మార్చుకోవాలని సిఎం రేవంత్ హెచ్చరించారు. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొవాలని, సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని సిఎం సూచించారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో వ్యవహారించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సిఎం పలు సూచనలు చేశారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే తీరుపై అసహనం
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ అన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరంలేదని, తప్పకుండా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంశం పై మాట్లాడాలని సిఎం సూచించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే వ్యవహారంపై సిఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సీఎల్పీ సమావేశం జరుగుతున్న సమయంలో జయవీర్ బయటకు వెళ్లారు. ఓ వైపు తాను ఇంత సీరియస్‌గా మా ట్లాడుతుంటే జయవీర్ అలా వెళ్తున్నారు, ఇంత నాన్ సీరియస్‌గా ఉంటారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై సిఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ప్లాన్‌తో పనిచేయాలి
బిఆర్‌ఎస్ పట్ల మీరు మంచి ఉద్ధేశ్యంతో ఉంటే మీపై బిఆర్‌ఎస్ వాళ్లు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా అని సిఎం వారితో పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ గురించి మీకు చాలా తక్కువ తెలుసనీ, రాజకీయాలంటే పిల్లలాట అనుకుంటున్నారా, వచ్చే ఎన్నికల్లోనూ ఎలా గెలవాలన్న ప్లాన్‌తో పనిచేయాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చాలామంది సీరియస్‌గా పనిచేయడం లేదని, ఒకసారి గెలవడం గొప్పకాదు, మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్పని ఆయన పేర్కొన్నారు.
జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా
ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని, 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందని సిఎం రేవంత్ ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని ఆయన తెలిపారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపిలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందామని ఆయన తెలిపారు. అందరి పనితీరుపై చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. సభ్యులు కచ్చితంగా సభకు రావాల్సిందేనని, సంతకం పెట్టిపోతామంటే కుదరదని ఆయన పేర్కొన్నారు. ఫ్లోర్ కో ఆర్డినేషన్ పకడ్భందీగా చేయాలని ఎమ్మెల్యేలతో సిఎం రేవంత్ పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ లో బిఆర్‌ఎస్ సభ్యులు అందోళన చేయడంతో పాటు గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు గవర్నర్ ప్రసంగిస్తుండగానే మరోవైపు బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లు సైలెంట్‌గా కూర్చోవడంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.