యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం లో ప్రముఖ ఆస్ట్రేలియన్ డాషిం గ్ బ్యాట్స్‌మెన్ డేవి డ్ వార్నర్ కూడా నటిస్తుండడం విశేషం. వార్నర్ మన తెలుగు ఆడియెన్స్ కి ఎంత దగ్గరయ్యాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టిక్ టాక్ ఉన్న సమయంలో అల్లు అర్జున్, మ హేష్ బాబు అలాగే ప్రభాస్ లాంటి స్టార్స్ పై పలు వీడియోలు చేసి తెలుగు ఆడియెన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. అయితే రాబిన్ హుడ్ సినిమాతో డేవిడ్ వార్నర్ తెలుగు ఆడియెన్స్‌ని అలరించేందుకు వస్తున్నాడు. అయితే లేటెస్ట్‌గా మేకర్స్ వార్నర్ సినిమా ప్రమోషన్స్‌కు కూడా వస్తాడని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. దీనితో తన డెబ్యూ సినిమాకి వార్నర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు.