Thursday, March 13, 2025

అసభ్య నృత్యాలు… మహిళా ఎస్‌ఐపై దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: జాతరలో అసభ్య నృత్యాలు చేస్తుండగా ఓ మహిళా ఎస్‌ఐ అడ్డుకోవడంతో ఆమెపై యువకులు దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడ మండలంలో జరిగింది. గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాల స్వామి జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. యువతులు స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా కొందరు మందు బాబులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు.

వెంటనే మహిళా ఎస్‌ఐ దేవి మందు బాబులను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఎస్‌ఐ జుత్తు పట్టుకొని దాడి చేయడంతో తప్పించుకొని ఓ ఇంట్లోకి వెళ్లి ఆమె దాచుకుంది. ఇంటి ముందు మందులు నానా రబస చేశారు. ఎస్‌ఐ దేవి సమాచారం మేరకు సిఐ అప్పలనాయుడు, మరికొందరు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకొని దాడి చేసిన మందుబాబులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకరు పరారీలో ఉన్నారని సిఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News