Friday, March 14, 2025

ప్రమాదంలో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రశ్నపత్రాల లీక్‌లపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ఈ లీక్‌ల కారణంగా కష్టపడి చదివే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిపి రావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘ ప్రశ్నాపత్రాల లీకులతో 6 రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వీటి కారణంగా కష్టపడి చదివే పిల్లలతో పాటు వారి కుటుంబాలు ఒత్తిడికి గురవుతున్నాయి. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదు.

దీనివల్ల కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సందేశం భవిష్యత్తు తరాలకు వెళ్తుంది. అది ఆమోద యోగ్యం కాదు. నీట్ పేపర్ లీక్ దేశాన్ని కుదిపేసి ఏడాది కూడా కాలేదు. దీనిపై మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాం. ప్రధాని మోడీ నేతృత్వం లోనిప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేక పోయింది. అది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి. ” అని రాహుల్ రాసుకొచ్చారు. పేపర్ లీక్‌లపై ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News