Friday, March 14, 2025

జగదీశ్‌పై వేటు

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దద్దరిల్లిన
అసెంబ్లీ ఇది అందరి సభ.. మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను
ఉద్దేశించి జగదీశ్ వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో
వాగ్వాదం స్పీకర్‌కు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన
మంత్రి శ్రీధర్‌బాబు జగదీశ్ మాటల్లో తప్పేముంది? మీ
ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంటరీ కాదు ప్రశ్నించిన బిఆర్‌ఎస్
నేత హరీశ్‌రావు సభ శాంతించకపోవడంతో వాయిదా వేసిన
స్పీకర్ దాదాపు ఐదు గంటల విరామం తరువాత తిరిగి
ప్రారంభమైన సభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్
శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదన
ఎథిక్స్ కమిటీకి పంపాలని ఉత్తమ్ సూచన ఎథిక్స్ కమిటీ నిర్ణయం
వచ్చే వరకు జగదీశ్‌ను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సిఎం భట్టి
ప్రతిపాదన ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు

మన తెలంగాణ /హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రె డ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ గ డ్డం ప్రసాద్ కుమార్‌ప్రకటించారు. అసెంబ్లీ బ డ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్ష న్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్‌రెడ్డి స భ్యత్వం రద్దు చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్య ల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీశ్‌రెడ్డిపై స స్పెన్షన్ వేటు వేయాలని సభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించగా స్పీకర్ గ డ్డం ప్రసాద్ కుమార్ అందుకు ఆమోదం తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద కార్యక్రమం మొదలైంది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సభ మీ ఒక్కరిదే కాద ని స్పీకర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

దీనిపై మండిపడిన కాం గ్రెస్ సభ్యులు స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ గా సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీం తో స్పీకర్ సభను వాయిదా వేశారు. మధ్యా హ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక జగదీష్ రెడ్డిని సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బిఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.తాము మాట్లాడేందుకు అవకాశమివ్వాలని బిఆర్‌ఎస్ సభ్యులు పట్టు పట్టారు. దీ నిపై బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. సచివాలయం రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే జగదీష్ రెడ్డి స్పీకర్ ను అగౌరవపరిచేలా మాట్లాడిన అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సభ్యులు కోరినట్టు సమాచారం.

సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం : తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం సభలో చర్చ వాడీవేడిగా కొనసాగింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని అన్నారు. ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందోనని, రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని అధికార పార్టీని ప్రశ్నించారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని నాలుగు బర్రెల కధను వినిపించారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత బిఆర్‌ఎస్ పాలనలో ఇచ్చిన హామీలపై మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన కెసిఆర్ తల నరుక్కున్నారా అని ప్రశ్నించారు. లక్ష అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారని, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ధ్వజమెత్తారు. తరువాత సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ సభ సంప్రదాయాల ప్రకారం జరగాలని, అధికార పక్షమే సభా మర్యాదలు పాటించకపోతే ఎలాగని ప్రశ్నించారు.

మందబలం ఉందని ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఆయన మాట్లాడుతుండగానే అధికార పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ముందు రన్నింగ్ కామెంట్రీ ఆపి మూసుకుని కూర్చోవాలని సీరియస్ అయ్యారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ కలుగజేసుకుని గవర్నర్‌కు గౌరవం ఇవ్వాలని, ఇదేం పద్ధతి అని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని వివరంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లడుతూ గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించింది తాము కాదని కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. దీనిపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వైఫల్యాలను తమ సభ్యులు చెప్పారని అందులో తప్పేమి ఉందన్నారు. గత పదేళ్లలో చేయలేనిది తాము ఏడాదిలోనే చేసి చూపించామని పేర్కొన్నారు. ఇంతలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ కలుగచేసుకుని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని జగదీశ్ రెడ్డికి సూచించారు. బీఆర్‌ఎస్ సభ్యులు అసహనానికి గురికావద్దని, సభా సంప్రదాయాలు పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించకూడదని సూచించారు. అయితే స్పీకర్ వ్యాఖ్య పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు.

సభా సంప్రాదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని, సభ స్పీకర్ సొంతం కాదని జగదీశ్ రెడ్డి కామెంట్ చేశారు. తనను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ అనగా సభలో జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాకే మాట్లాడతానని జగదీశ్ రెడ్డి బదులివ్వగా సభలో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు వెళ్లాలని ఆదేశించారు. కాగా సభ లోపల, బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఏకవచనంతో స్పీకర్ మాట్లాడటం బాధాకరమన్నారు. స్పీకర్‌ను అవమానించకుండా ఆదర్శనీయ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని, అప్పటి వరకు ఈ సేషన్ మొత్తం ఆ సభ్యున్ని సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చులకనగా మాట్లాడటం చూస్తే వారు సభాపతిగా చూడటం లేదన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి కేసీఆర్ మీకు ఇదే నేర్పించారా? అని ప్రశ్నించారు. మీ సంస్కారం చూస్తుంటే బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలను సభలో సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈరోజు సభ్యుడు మాట్లాడిన భాష అత్యంత అవమానకరమన్నారు. ఒక దళితజాతి బిడ్డ స్పీకర్‌గా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, స్పీకర్‌ను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. బలహీన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక బీఆర్‌ఎస్ అడిగినన్ని సార్లు అవకాశం ఇచ్చారన్నారు. జగదీష్ రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు.

మీకు మీకు అని మాట్లాడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గవర్నర్‌ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గవర్నర్ మాట్లాడింది తమ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ సభలో చెప్పలేదా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను దారుణంగా అవమానించారన్నారు. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్ ను కోరుతున్నాని మంత్రి సీతక్క తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంట్‌లో టీఎంసీ సభ్యుడు ప్రవర్తన సరిగా లేనందున సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దళిత జాతికి చెందిన సీనియర్ నేత స్పీకర్ హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి పై చేసిన వ్యాఖ్యలు ఆయన ఆహంకార ధోరణిని బయట పెట్టినట్లయిందని ఆయన అన్నారు. ఈ తరహాలో ఏ సభ్యుడు మాట్లాడినా ఊపేక్షింది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జగదీష్ రెడ్డిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సభ్యులు చర్చ అనంతరం జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.

చీఫ్ మార్షల్‌తో వాగ్వాదం : అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరగా అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు వచ్చేశారు. సస్పెండ్ అనంతరం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు. అయితే సభా వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చీఫ్ మార్షల్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాదించారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చీఫ్ మార్షల్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అందరం కలిసి పని చేద్దాం : శాసనసభా వ్యవహరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

అసెంబ్లీలో జరిగిన రగఢకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభ, స్పీకర్ యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నామని, కుర్చీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అగౌరవకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే ప్రతిపక్ష సభ్యులు ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. అంతేగాక అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇక మర్యాద, గౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి అందరం కలిసి పని చేద్దామని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలున్నాయి. మా అందరి తరపున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు..
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి..

గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరూ చేయకండి.. స్పీకర్ అంటే గౌరవం ఉంది.. సభలో ఎలాంటి అలజడి వచ్చినా.. మనమంతా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..
అక్బరుద్దీన్ ఒవైసీ..

సభను నడిపే సంపూర్ణ హక్కులు రాజ్యాంగం స్పీకర్‌కు కల్పించింది..
జగదీశ్ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపండి.. ఎథిక్స్ కమిటీ నిర్ణయం వచ్చేవరకు సభ్యుడిని సస్పెండ్
చేయాలని సూచిస్తున్నా.
డిప్యూటీ సిఎం భట్టి
స్పీకర్‌ను దూషించేలా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడిన
ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆయన
అహంకారంతో మాట్లాడకుండా
క్షమాపణ చెప్పాల్సిందే…
మంత్రి శ్రీధర్‌బాబు..
శాసన వ్యవస్థను అవమానించినట్లు మాట్లాడిన వారిపై కఠిన చర్యలు
తీసుకోవాలి. జగదీశ్ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలి..స్పీకర్‌ను
ఏకవచనంతో సంబోధించడం సరికాదు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ సభ సంప్రదాయాలను పాటించాలి. మీరు అధికారంలో
ఉన్నప్పుడు మమ్మల్ని వెల్‌లోకి కూడా రానీయలేదు. స్పీకర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి
శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని
ప్రతిపాదిస్తున్నా..
మంత్రి సీతక్క

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News