- Advertisement -
గుంటూరు: ‘సంస్కారవంతమైన సోప్’గా ప్రాచుర్యం పొందిన ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్(77) కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1980లో గుంటూరుకు వచ్చిన ఆయన తొలినాళ్లలో రిక్షాపై ఇంటింటికీ తిరుగుతూ తాను తాయారు చేసిన సబ్బులు విక్రయించేవారు. ప్రకటనలకు ప్రాముఖ్యం ఉందని గుర్తించిన ఆయన బహుళ ప్రజాదరణ పొందిన సినిమా పాటల పల్లవులను ప్రచారానికి వాడారు. గుంటూరులో పలు సాంస్కృతిక, సేవ సంస్థలు, తమిళ సంఘాలకు ఆయన చేయూతనిచ్చారు. మాణిక్యవేల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు బంధువులు వెల్లడించారు.
- Advertisement -