Saturday, March 15, 2025

రోహిత్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టే!

- Advertisement -
- Advertisement -
  • ఊహాగానాలకు తెరదించిన హిట్‌మ్యాన్

ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు కొన్ని రోజులుగా మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే రోహిత్ రిటైర్మెంట్ గురించి ప్రకటన చేస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. కానీ రోహిత్ మాత్రం రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొన్నేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగుతాననిస్పష్టంచేశాడు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ విషయంలో వచ్చిన వార్తల్లో పసలేదని తేలిపోయింది. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియాలో కొనసాగాలని రోహిత్ భావిస్తున్న విషయం స్పష్టమైంది. ఇక బిసిసిఐ పెద్దలు కూడా రోహిత్ వచ్చే వరల్డ్‌కప్ కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకుంటున్నారు. రోహిత్ కూడా మరికొన్నళ్ల పాటు వన్డేలు, టెస్టుల్లో ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు.

ఆ రెండు ట్రోఫీలు సాధించాలని..

రోహిత్ తన సారథ్యంలో భారత్ రెండు ఐసిసి ట్రోఫీలు సాధించింది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా టి20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. తాజాగా పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు చేరినా ట్రోఫీని సాధించడంలో విఫలమైంది. ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ రెండు ట్రోఫీలు ముగిసే వరకు కెప్టెన్‌గా కొనసాగాలని భావిస్తున్నాడు. బిసిసిఐ కూడా దీనికి సానుకూలంగా ఉండడంతో రోహిత్ కెప్టెన్‌గా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రానున్న ఐపిఎల్‌లో రోహిత్ ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈటోర్నమెంట్‌లో మెరుగైన ఆటను కనబరిస్తే రోహిత్ ఆత్మవిశ్వా సం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. ఇక భారత్‌కు లభించిన అత్యుత్తమ కెప్టెన్‌లలో రోహిత్ ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సారథ్యంలో భారత్ మూడు ఫార్మాట్‌లలోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. టి20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత రోహిత్ పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన వెంటనే వన్డేలకు కూడా వీడ్కో లు పలుకుతాడని వార్తలు వినిపించాయి. కానీ హిట్‌మ్యాన్ మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించుతూ తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. దీంతో మరికొన్నేళ్ల పాటు రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News