Friday, March 14, 2025

‘కోర్ట్’ ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న సినిమా ‘కోర్ట్ – – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరులతో ముచ్చటించారు. ప్రశాంతి తిపిర్నేని మాట్లాడుతూ “-సినిమా ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసి ‘వావ్’ అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చాయి. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన స్పందన వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. -ప్రీమియర్స్‌కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత నేచురల్‌గా చూపించడం ఇంతముందు చూడలేదని చెప్పారు. ఇది మాకు మంచి కాంప్లిమెంట్‌”అని అన్నారు. దీప్తి గంటా మాట్లాడుతూ “-నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది. -సినిమాలో రోహిణి క్యారెక్టర్‌తో వచ్చే ఓ సీన్ చాలా నచ్చింది. అలాగే మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ అద్భుతంగా చేశారు. ప్రతి ఇంట్లో అలాంటి ఓ క్యారెక్టర్ వుంటుంది. డైరెక్టర్ జగదీశ్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు. అందుకే సినిమా చాలా నేచురల్‌గా వచ్చింది. పోక్సో చట్టం గురించి ఆయన చాలా వివరంగా చూపించాడు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News