Saturday, March 15, 2025

‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు తొలి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించారు. మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్‌కళ్యాణ్, నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. 17వ శతాబ్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్‌కళ్యాణ్ వీర యోధుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ దేవోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీలు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ఎ దయాకర్ రావు నిర్మిస్తుండగా.. ఎ ఎం రత్నం సమర్పిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News