Friday, March 14, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌, ఆఫీస్‌-డెవలపర్‌, సీనియర్‌ మేనేజర్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాగా, ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య :518
ఖాళీల వివరాలు : సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌, ఆఫీస్‌-డెవలపర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌-క్లౌడ్ ఇంజినీర్‌, ఆఫీసర్‌-ఏఐ ఇంజినీర్‌, మేనేజర్‌-ఏఐ ఇంజినీర్‌, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్‌, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్‌, మనేజర్‌ ఏపీఐ డెవలపర్‌, మేనేజర్‌- నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ మేనేజర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌.
దరఖాస్తు చివరి తేదీ: 2025 మార్చి 21
వయసు: ఉద్యోగాన్ని బట్టి వయసు
విద్య అర్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు రూ.600గా, ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది.
వెబ్ సైట్: https://www.bankofbaroda.in

మరిన్ని వివరాలకు https://www.bankofbaroda.in అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News