Saturday, March 15, 2025

బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి కారు దూసుకుపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. అతి వేగంతో దూసుకువెళ్లిన కారు బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News