Friday, March 14, 2025

మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన స్టైల్‌తో, డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో కోట్లాది మంది సినీ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా విడుదలైందంటే చాలు ఆ రోజు అభిమానులకు పండగే. ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్ధాలు దాటినా.. ఇప్పటికి యువ హీరోలకు పోటీ ఇస్తూ.. సినిమాలు చేస్తున్నారు చిరు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.

సినీ ఇండస్ట్రీలో 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న కృషికి యుకె పార్లమెంట్‌లో గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆయనకు జీవితసాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నట్లు యుకె పార్లమెంట్ ప్రకటించింది. ఈ అరుదైన గౌరవాన్నిను ఆయన మార్చి 19వ తేదీన అందుకోనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News