Saturday, March 15, 2025

రాహుల్ ప్రతీ దానికి అర్హుడే.. ఆసీస్ పేసర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని భారత్ ప్రపంచానికి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఆటగాడు కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి ట్రోఫీని ముద్దాడింది రోహిత్ సేన. అయితే భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి జట్టు కోసం విలువైన పరుగులు రాబట్టాడు. ఈ సందర్భంగా అతన్ని సీనియర్లే కాదు.. ప్రస్తుత ఆటగాళ్లు కూడా అభినందిస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన స్టార్క్.. రాహుల్‌ని ‘మిస్టర్ ఫిక్స్‌ఇట్’గా స్టార్క్ అభివర్ణించాడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని స్టార్క్ చెప్పుకొచ్చాడు. ‘రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేయాల్సి వస్తే అందుకు సరే అంటాడు. అందుకే ప్రతీ దానికి అతను అర్హుడు’ అని స్టార్క్ అన్నాడు. అతనితో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News