Saturday, March 15, 2025

గ్రూప్-3 ఫలితాలను విడుదలు చేసిన టిజిపిఎస్సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవలే గ్రూప్-1, గ్రూప్‌-2 పలితాల విడుదల తర్వాత గత ఏడాది నవంబర్‌లో జరిగిన గ్రూప్-3 పరీక్షల ఫలితాలను టిజిపిఎస్సి శుక్రవారం విడుదల చేసింది. ఇందులో అభ్యర్థుల మార్కులతో పాటు.. జనరల్ ర్యాంకుల జాబితాను కూడా ప్రకటించింది. గ్రూప్-3 పరీక్ష తుది కీ, మాస్టర్ క్వశ్చర్ పేపర్, ఒఎంఆర్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

1,365 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో 1,401 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,69,483 మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం మూడు పేపర్లుగా ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను మార్చి 17వ తేదీన, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News