Saturday, March 15, 2025

డెన్వర్ విమానాశ్రయంలో అమెరికా విమానానికి మంటలు

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్ వద్ద గురువారం అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అప్రమత్తం అయిన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. గురువారం మధ్యాహ్నం గేట్ సి38 వద్ద ఆ విమానం ఉన్నప్పుడు మంటలు చెలరేగాయని అనేక వార్తా సంస్థలకు విమానాశ్రయం ప్రతినిధి వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. కొలరాడో స్ప్రింగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి డాలస్ ఫోర్ట్‌వర్త్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇంజిన్‌లో కంపనాలు చోటుచేసుకోవడంతో

దానిని వెంటనే డెన్వర్ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించి దించేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విమానం అంతా దగ్ధమయిపోయింది. ఈ ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక్ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి సాయంత్రానికల్లా మంటలను ఆర్పేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి విమానం రెక్కపై ప్రయాణికులు నిలుచుని ప్రాణాలు దక్కించుకున్న ఫోటోను ‘సిబిఎస్ న్యూస్’ షేర్ చేసింది. రెక్క వెనుక పొగ ఆవరించి ఉండడం కూడా ఆ ఫోటోలో స్పష్టంగా కనిపించింది. అదృష్టంకొద్దీ అంతా క్షేమంగా బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News