- Advertisement -
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లిఫ్ట్ గుంతలో పడి యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఇద్దరి స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో లిఫ్ట్ గుంతలో పడిపోయారు. గమనించిన తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఒకరు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఓల్డ్ ఆఫీజ్ పెట్ కి చెందిన నరేందర్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -