కారు అదుపు తప్పి ఫుట్‌ఫాత్‌ను ఢీకొట్టిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ వన్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…వేగంగా దూసుకు వచ్చిన కారు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ వన్‌లో ఉన్న సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫుట్ పాత్ పైకి కారు దూసుకెళ్లింది. అతివేగం, అజాగ్రత్తతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారును చూసి స్థానికులు పరుగులు తీశారు. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు..కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
సినీ హీరో బాలకృష్ణ ఇంటి ముందుకారు భీభత్సం
- Advertisement -
- Advertisement -
- Advertisement -