ఢిల్లీ కేంద్రంగా బిజెపిపై కాంగ్రెస్ కుట్రలకు తెర లేపిందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని.. అందుకే డీలిమి టేషన్ పేరుతో తమిళ నాడు లో అధికారంలో ఉన్న డీఎంకే దేశ వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్వి భజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయినా 2026 తరువాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోం దని.. సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం ఎందు కని, ఆరు గ్యారంటీలపై ముందుగా మీటింగ్ పెట్టాల్సిందేని ఎంపి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.