సత్తా చాటిన పురుషులు టాప్ 10లో
ఒక్కరు..టాప్ 50లో నలుగురు మహిళలు
2,49,567 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన
అతి తక్కువ సమయంలోనే ఫలితాలు :
టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 2లక్షల 49వేల 557 మందికి సంబంధించిన జనరల్ ర్యాంకులతో పాటే ఫైనల్ కీని సైతం విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్ 1, 11న గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 3 ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ సారి గ్రూప్ 3లో పురుషులు సత్తా చాటారు. 400 మార్కులకు జరిగిన పరీక్షలో ఓ అభ్యర్థి 339.239 మార్కులు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో కేవలం ఒక్కరు మాత్రమే మహిళ కాగా మొదటి 50 ర్యాంకుల్లో కేవలం 4 మహిళలే ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ లో మొత్తం 1388 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా 5 లక్షల 36వేల 400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 50.24 శాతం అంటే 2 లక్షల 67వేల 921 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
వీరిలో 18 వేల 364 మంది ఓఎంఆర్ ఇన్ వ్యాలీడ్ కాగా 2 లక్షల 49వేల 557 మంది జనరల్ ర్యాంకులను టీజీపీఎస్సీ ప్రకటించింది. జనవరి 8న గ్రూప్ 3 ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్ 8 నుంచి 12వ తేదీ వరకు కీ పై అభ్యంతరాలను స్వీకరించింది. అయా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం తుది కీ, జనరల్ ర్యాంకులు విడుదల చేసినట్టు కమిషన్ పేర్కొంది. అభ్యర్ధులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్‌లో లాగిన్ ఐడీ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. జనరల్ ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వటంతోపాటు వెబ్ సైట్ లోనూ వివరాలు పొందుపరుస్తామని స్పష్టం చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనున్నారు.
అతి తక్కువ సమయంలోనే ఫలితాలు : టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
అతి తక్కువ సమయంలోనే ఎలాంటి తప్పులు లేకుండా గ్రూప్స్ ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కమిషన్ ఇచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరాదు. ఈసారి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-1 ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రూప్ 3 ఫలితాల విడుదల సందర్భంగా అతి తక్కువ సమయంలోనే ఎలాంటి తప్పులు లేకుండా గ్రూప్స్ ఫలితాలు విడుదల చేశామన్నారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కమిషన్ ఇచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.
గ్రూప్ 3లో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన అబ్బాయిలు
1 ర్యాంకు హాల్‌టికెట్ నంబరు 450కి సాధించిన మార్కులు
1 1 2295819138 339.239
2 2 2291113046 331.299
3 3 2295404444 330.427
4 4 2291818231 329.279
5 5 2295819112 327.245
6 6 2293324675 326.272
7 7 2296409046 326.225
8 8 2295818625 325.157
9 9 2296409077 323.184
10 10 2292807296 323.157
గ్రూప్ 3లో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన అమ్మాయిలు
1 ర్యాంకు హాల్‌టికెట్ నంబరు 450కి సాధించిన మార్కులు
1 8 2295818625 325.157
2 37 2293033457 312.11
3 46 2292014056 309.184
4 47 2294411415 308.157
5 51 2295302791 308.124
6 55 2295210215 307.097
7 70 2293033185 305.056
8 77 2295211076 304.103
9 82 2296414368 303.076
10 92 2293035165 301.239