సైదాబాద్ భూలక్ష్మీ మాతా టెంపుల్ అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ యాసిడ్ పోసి టెంపుల్ అకౌంటెంట్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో అకౌంటెంట్‌గా ఉన్న నర్సింగ్ రావ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తి బైక్‌పై వెళ్లి యాసిడ్ పోసి వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. గాయపడిన నర్సింగ్ రావును స్థానికులు యశోదా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు జగిత్యాలలో హోలీ పండగ పూట విషాద ఘటన జరిగింది. వెల్దుర్తి మండలం భావోజిపల్లి శివార్లలో ఎస్సారెస్పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి సాగర్ గౌడ్ అనే వ్యక్తి గల్లంతు అయిన ఘటన పండగ పూట విషాదం నింపింది. మిత్రులతో హోలీ ఆడి సాగర్ అనే యువకుడు కెనాల్‌లో స్నానానికి దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాగర్ గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని రూరల్ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 2 గంటల తర్వాత సాగర్ ఆచూకీ లభ్యమైంది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.