Saturday, March 15, 2025

హోలీ…రంగులకేళీ

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న,పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందడోలికల్లో మునిగితేలారు. ఉత్తర భారతం రంగుల హరివిల్లుగా మారింది. కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ చిన్నారులతో హోలీ జరుపుకున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్ని తాకాయి. చిన్నా పెద్దా రంగులు చల్లుకుంటూ సందడి చే శారు. పలు చోట్ల కామదహన వేడుకలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో యువకులు కేరితలు కొడుతూ హో లీ వేడుకలను చేసుకున్నారు. యువత బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు.చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ బయటికి వచ్చి హోలీ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడంతో నిత్యం ట్రాఫిక్ తో నిండిపోయే హైదరాబాద్ రోడ్లు శుక్రవారం హోలీ రంగులతో కలర్ ఫుల్ గా మారాయి. పలు ప్రాంతాల్లో హోలీ ఈవెంట్స్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో యువత సందడి చేశారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్న వారితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వారి ఉత్సాహానికి సంగీతం ఇంకాస్త జోష్ పెంచింది. హుషారెత్తించే డీజే సాంగ్స్ స్టెప్పులతో హోరెత్తించారు. బేగంబజార్‌లో యూత్ హోలీ ఆడి చిందేశారు. రంగు జల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ప్రతి గల్లీలో కుర్రకారు డీజే సాం గ్స్.. రెయిన్ డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు. కూకట్‌పల్లిలో మస్త్ గ్రాండ్‌గా హోలీ పండుగ సెలెబ్రేట్ చేసుకున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు మస్త్ ఎంజాయ్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నూ హోలీ సెలబ్రేషన్స్ నెక్స్ లెవల్‌లో జరిగాయి. ఆనందోత్సాహాల మధ్య ఉ స్మానియా విశ్వవిద్యా లయంలో హోలీ వేడుకలు జరిగాయి. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డిజె పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

60 అంతస్తుల బిల్డింగ్ పై హోలీ సెలెబ్రేషన్స్
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో 60 అంతస్తుల బిల్డింగ్ పై హోలీ సె లెబ్రేషన్స్ కి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న దక్షిణ భారతదేశం లోనే అత్యంత ఎత్తైన టవర్ ఎస్‌ఎఎ స్ క్రౌన్‌పై పై స్కై బ్లాస్ట్ హోలీ నిర్వహించారు నిర్వాహకులు. 60 అం తస్తుల భవనంపై నిర్వహించిన ఈ స్కై బ్లాస్ట్ ఆకాశానికి రంగు అద్దినట్లు ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేశారు. స్కై బ్లాస్ట్ హోలీలో రం గుల తుఫాన్, 360ఓ స్కై వ్యూ ప్రత్యేకంగా నిలిచాయి.

మల్లారెడ్డి డ్యాన్స్
హోలీ పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న తన నివాసంలో పెద్ద ఎత్తున ఎంఎల్‌ఎ మల్లారెడ్డి సంబురాలు జరుపుకున్నారు. మల్కాజిగిరి ఎంఎల్‌ఎ రాజశేఖర్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులతోనూ, పిల్లలతోనూ కలిసి నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.హోలీ సందర్భంగా ఈసారి పోలీసులు కూడా చాలా అప్రమత్తమయ్యారు.. అందుకు కారణం రంజాన్ మాసంలో వచ్చే రెండో శుక్రవారం కూడా కావటమే. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయం ఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News