Saturday, March 15, 2025

ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు అక్షర్ పటేల్ సారథ్యం వహిస్తాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేపట్టేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఢిల్లీ యాజమాన్యం ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించింది. కిందటి సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ యాజమాన్యం వదులుకుంది. దీంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. తొలుత సీనియర్ ఆటగాడు రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ యాజమాన్యం భావించింది. కానీ కెప్టెన్సీపై రాహుల్ ఆసక్తి చూపించలేదు. దీంతో మరో కీలక ఆటగాడు అక్షర్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 1,653 పరుగులు, 123 వికెట్లను పడగొట్టాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో బ్యాట్‌తో, బంతితో రాణించి టీమిండియా ట్రోఫీ సాధించడంలో తనవంతు సహకారం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News