Saturday, March 15, 2025

రాహుల్ అద్భుత క్రికెటర్: మిఛెల్ స్టార్క్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్‌పై ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో రాహులే కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా అతనిలో ఉందన్నాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ అసాధారణ ఆటతో అలరించాడని, జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ప్రస్తుతం భారత జట్టులో రాహులే అత్యంత ప్రధాన ఆటగాడని, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ప్రవీణ్యం అతనిలో ఉందన్నాడు. భవిష్యత్తులో భారత జట్టు కీలక ఆటగాళ్లలో రాహుల్ ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు. రాహుల్‌కు టీమిండియాలో తగినంత గుర్తింపు లభించడం లేదని స్టార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఈ విషయంలో దృష్టి సారించి రాహుల్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించేందుకు టీమిండియా అన్ని విధాలుగా అర్హురాలైని పేర్కొన్నాడు. దుబాయిలో ఆడినా ఆస్ట్రేలియాలో ఆడినా ట్రోఫీ సాధించే సత్తా టీమిండియాకు ఉందన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం భారతే మెరుగైన జట్టు అని స్టార్క్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News