Saturday, March 15, 2025

హోలీ వేడుకలో మునిగితేలుతూ…

- Advertisement -
- Advertisement -

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టుతో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోలీ శుభ సందర్భంగా, మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది మొత్తం టీం వారి ముఖాల్లో ఆనందంతో నిండినట్లు చూపిస్తుంది. సాయి దుర్గ తేజ్ టీంను ఉత్సాహపరిచేందుకు తన చేతిని పైకెత్తడం కనిపిస్తుంది. సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం టీం హైదరాబాద్‌లో ఒక పాటను చిత్రీకరిస్తోంది. భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News