స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎమోషన్స్, కలర్స్, లైఫ్ సెలబ్రేషన్‌గా ఉంటుందని హామీ ఇస్తోంది. హోలీ సందర్భంగా పండుగ సారాంశాన్ని పర్ఫెక్ట్ గా చూపించే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సిద్దు, రాశి, శ్రీనిధి అందరూ కలిసి పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ కలర్ ఫుల్ గా కనిపించారు. సిద్దూ సాంప్రదాయ కుర్తా ధరించి కనిపించగా, రాశి, శ్రీనిధి చీరలలో చక్కదనం జోడించారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. తెలుసు కదా కూడా పండుగలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఈ విజువల్ తెలియజేస్తోంది. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘తెలుసు కదా’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
పండుగలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -