- Advertisement -
హైదరాబాద్: సైదాబాద్‌లోని భూలక్ష్మీ దేవాలయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి గుడి అకౌంటెట్‌పై యాసిడ్ పోడర్‌తో దాడికి పాల్పడ్డాడు. గుడిలో అకౌంటెట్‌గా పని చేస్తున్న నర్సింగ్‌రావు అలియాస్ గోపి పని చేస్తుండగా.. ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని అతని వద్దకు వచ్చాడు. అతనితో ఏదో మాట్లాడుతూ కొంతసేవు అక్కడే ఉన్నాడు. అనంతరం జేజులోంచి ఏదో యాసిడ్ పోడర్‌ను బయటకు తీసి.. నర్సింగ్‌రావు తలపై పోసి అక్కడి నుంచి పారారయ్యాడు. వెంటనే నర్సింగ్‌రావు లేచి తలంతా దులుపుకుంటూ.. నొప్పితో విలవిలలాడిపోయాడు. అతన్ని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనంతా అక్కడున్న సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -