Saturday, March 15, 2025

‘బౌండరీ టూ బాక్సాఫీస్’.. వార్నర్ ఫస్ట్‌లుక్‌ విడుదల!

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కి భారతదేశంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అతను క్రికెట్ ఆడటంతో పాటు.. తెలుగు సినిమా డైలాగ్స్‌కి, పాటలకు రీల్స్ చేసి అతను ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశాడు. అయితే ఇంతకాలం మైదానంలో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ అనే సినిమాలో వార్నర్‌లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా వార్నర్‌ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్ అంటూ ఈ సినిమాకి క్యాప్షన్ ఇచ్చింది. ఈ లుక్ సినిమా అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. వార్నర్‌ని తెరపై ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

కాగా ‘భీష్మ’ తర్వాత నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మార్చి 28వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News