దేశంలో కుల గణన చేపట్టాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ దశగా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాన్షీరామ్ జయంతి సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన మాయావతి కులగణన చేయాలని పునరుద్ఘాటించారు. సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిని విస్మరించకూడదని ఆమె సూచించారు. కులగణన చేయకుంటే అది సుపరిపాలన కాబోదని ఆమె అన్నారు. కులగణన చేయకపోవడంపై ఒక పార్లమెంటరీ కమిటీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందని మాయావతి గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో 80 శాతం మంది బహుజనులు ఉన్నారని, ఇటువంటి చోట్ల కులగణన చాలా ముఖ్యమని ఆమె అన్నారు. మాయావతి మరొక ట్వీట్‌లో తనను ఒక ఉక్కు మహిళగా పేర్కొన్నారు. ఉక్కు మహిళ నాయకత్వంలోని బిఎస్‌పి మాటల కంటె చేతలకు ఎంత విలువ ఇస్తుందో ఉత్తర ప్రదేశ్ ప్రజలకు తెలుసునని మాయావతి పేర్కొన్నారు.
దేశంలో కుల గణన చేయాలి:మాయావతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -