- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు నుద్దేశించి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు. శనివారం శానసమండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్‌పై ఉపయోగించిన మాటలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని సూచించారు. మనమంతా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం, ఇవాళ ఏం చేస్తామో మళ్ళీ అది మనకు వాపస్ వస్తుంది, గత ఐదారేండ్లు కాంగ్రెస్ వాళ్లు చేసిన పనే తిరిగి వాళ్లకు చుట్టుకుంటున్నది అని కవిత వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనా చారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని ఆమె విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ హుందాగా రాజకీయాలు చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించిన భాషను తాము ప్రయోగించలేమన్నారు.
- Advertisement -