ఎపి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధ్దారణ
తెలంగాణ అభ్యంతరాలు సబబేనని నిరూపణ ఇది రాష్ట్ర
ప్రభుత్వ విజయం కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను
వదులుకునేది లేదు నీటిపారుదలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ
మన తెలంగాణ / హైదరాబాద్ ః కృష్ణా నదీ జలాలపై నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి(ఆర్.ఎల్.ఐ.సి) కేంద్రం పర్యావరణ అనుమతులు ని రాకరించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్ణయా న్ని వెల్లడించింది. ఏపి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మించేందుకు అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 27 తేదీన జరిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్.జి.టి) 25 వ సమావేశంలో ఉ త్తర్వులను సమీక్షించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిం చి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసినట్లు నిర్ధ్దారించింది. వాస్తవానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ర్మాణం ఏపి ప్రభుత్వం చేపట్టిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రం వద్ద పలు సందర్భాల్లో వాదనలు వినిపించింది.
కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం విజయంగా నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జ లాల్లో తెలంగాణా వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను బేఖాతర్ చేస్తు న్న ఏపి సర్కారు తీరును తెలంగాణ ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్ర భుత్వానికి ఆధారాలతోసహా అందించి విజయం సాధించారని ఆ యన వివరించారు. అంతరాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను కుడా కాదని ఏపి సర్కారు ఈ ప్రాజెక్టు ను మొదలు పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను కాపాడేందుకు శాయశక్తుల కృషిచేస్తుందన్నారు. ఏపి ఏకపక్ష చర్యలపై కేంద్ర పర్యావరణ మంత్రితో తాను వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ఆర్.ఎల్.ఐ.సి నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండిఉంటే తెలంగాణా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి తీవ్ర ఇక్కట్లు కలిగే ప్రమాదం ఉందన్నారు.