జనజీవనస్రవంతిలోకి వివిధ కేడర్ల
సభ్యులు రెండున్నర నెలల్లో 122
మంది లొంగుబాటు ప్రభుత్వఫలాలు
అందేలా చూస్తాం : పోలీసుల ప్రకటన
మన తెలంగాణ/లక్ష్మీదేవిపల్లి: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొం గిపోయారని ఐజి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మం డల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా పోలీసులు, 81 బెటాలియన్, 141 బెటాలియన్, సిఆర్‌పిఎఫ్ అధికారులు, ఆదివాసీ ప్రజల అభివృ ద్ధి.సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమా లు, ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆ క ర్షితులై లొంగిపోయారన్నారు. లొంగిపోయిన మావోయి స్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తు న్న సౌకర్యాల గురించి తెలుసుకొని నక్సలిజాన్ని విడిచిపె ట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలి సి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించు కున్నారన్నారు.
ఎసిఎం 1, పార్టీ మెంబర్లు 10 మంది, ఆర్‌పిసి కమిటీ మెంబర్లు 9 మంది, ఆర్‌పిసి మిలీషియా సభ్యులు 19 మంది, ఆర్‌పిసి డక్షక్ సభ్యులు 11 మంది, ఆర్‌పిసి సిఎన్‌ఎం 6, ఆర్‌పిసి జిఆర్‌డి సభ్యులు 8 మంది లొంగిపోయిన వారిలో ఉన్నారని వివరించారు. గడిచిన రెండున్నర నెలల కాలంలో వీరితో కలిపి 122 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన అనంతరం వారికి చెందాల్సిన ప్రతిఫలాలను కూడా తక్షణమే అందేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేక స్వయంగా కానీ, తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి రోహిత్‌రాజు, భద్రాచలం ఎఎస్‌పి విక్రాంత్ కుమార్ సింగ్, సిఆర్‌పిఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.